![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -502 లో..... ధీరజ్ కార్ ని బ్యాంక్ వాళ్ళు తీసుకొని వెళ్లారని ప్రేమ బాధపడుతుంది. ఇప్పుడు పది లక్షలు కావాలి అప్పుడే ధీరజ్ కార్ వస్తుందని ప్రేమ ఏడుస్తుంటే ధీరజ్ వచ్చి ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు. నీకు కార్ తీసుకొని వెళ్లినందుకు భాదగా లేదా అని ప్రేమ అడుగుతుంది. లేదు అవన్నీ మర్చిపోమని ధీరజ్ తనకి నచ్చజెప్పుతాడు. మరొకవైపు వల్లి దగ్గరికి ప్రేమ, నర్మద వెళ్లి అక్క నీ కోసం ట్యాబ్లెట్ తీసుకొని వచ్చాము. నువ్వు నిజంగా కడుపుతో ఉన్నావ్ కదా లేదంటే మోషన్స్ అవుతాయని ప్రేమ అంటుంది.
నన్ను అనుమానించు కానీ నా కడుపుని కాదని వల్లి అంటుంది. వల్లి ఆ ట్యాబ్లెట్ వేసుకొని రాత్రంతా బాత్రూం రూమ్ కి తిరుగుతునే ఉంటుంది. ఆ తర్వాత మిల్ లో దొంగతనం చేసిన డబ్బుతో భాగ్యానికి ఆనందరావు పట్టీలు తీసుకొని వస్తాడు. ఎక్కడివి డబ్బు అని భాగ్యం అడుగుతుంది. మిల్ లో దొంగతనం చేశానని చెప్పగానే నేను మిల్ ని సొంతం చేసుకోవాలనుకుంటే నువ్వు ఏంటి ఇలా చేస్తున్నావని భాగ్యం కోప్పడుతుంది. మరొకవైపు ప్రేమకి తన ఫ్రెండ్ ఫోన్ చేసి నీ డాన్స్ కి పది లక్షలు వచ్చే ఛాన్స్ ఉంది.. దానికి అప్లై చెయ్ అని చెప్తుంది. ధీరజ్ కి చెప్తానని ప్రేమ అంటుంది.
ఇప్పుడు ఎందుకే నువ్వు సెలక్ట్ అయ్యాక చెప్దామని ప్రేమతో తన ఫ్రెండ్ అంటుంది. సరే నువ్వు డ్యాన్స్ వీడియో పంపించు నేను అప్లై చేస్తానని తన ఫ్రెండ్ అనగానే ప్రేమ సరే అంటుంది. మరొకవైపు భద్రవతి ఇంటికి కోర్ట్ నుంచి నోటీసులు వస్తాయి. విశ్వ పై అమూల్య గురించి ధీరజ్ పెట్టిన కేసు గురించి కోర్ట్ కి హాజరు కావాలని ఉంటుంది. అప్పుడే బెయిల్ రాలేదు.. ఇప్పుడు శిక్ష తప్పకుండా పడుతుందని భద్రవతి భయపడుతుంది. శిక్ష పడకుండా ఏం చెయ్యాలని సేనాపతి అంటాడు. దానికి ఒక్కటే మార్గం.. రామరాజు అని పెద్దావిడ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |